Kākaḍa Ārati
Seven Bhajans in Sanskrit by H.H. Sri Ganapathy Sachchidananda Swamiji — One for Each Day of the Week
Kākaḍa means torch. Sixteen deepam and two more are lit in the Dattatreya temple for this service, which is the last seva of the day. In Maharashtra it is the first service instead. H.H. Sri Ganapathy Sachchidananda Swamiji has composed seven bhajans in Sanskrit to be sung during it — one for each day of the week, each set in its own rāgam. The page opens on today’s ārati.
The Telugu view sets the Sanskrit verse in Telugu script and the IAST view romanises the same verse; neither is a translation. English is given under Meaning.
datta datta datta datta datta jai
దత్త దత్త దత్త దత్త దత్త జై చరణం : వినతిరస్తు దత్తదేవ మూర్తయే విహిత భక్త వాంఛితార్థ పూర్తయే దత్తదేవునకు ప్రణామమగుగాక ! భక్తులు కోరిన అర్థములను(ప్రయోజనములను) పరిపూర్తి చేయునట్టి దత్తదేవమూర్తికి వినతియగునుగాక ! దత్త దత్త అనుచు కనీసము అయిదుమారులు జయ జయ ధ్యానములతో ఉచ్ఛరించినచో భక్తవాంఛితములను ఈడేర్చునని సూచితమైనది. 2.
మధుర మంజు దివ్య మందహాసినే ప్రణతులయినవారి హృదయ మందిరములలో నివసించువానికి, మనోహరమయిన భవ్యమయిన చిరునగవు గలవానికి, ప్రణతి అగును గాక! నతులయినవారి అనేక హృదయములలో ఒకేసారి నివసించు దేవుడు, తన చమత్కారమునకు తానే నవ్వుచున్నాడా అనుపించునట్లుగ నవ్వుచున్నాడు. ఆ చిరునవ్వు ముగ్ధమోహనముగ యున్నది.
3.
అమరవీర్య వర్ధనాయ ధీమతే జంభాసురుని విజృంభణమును రూపుమాపిన దత్తదేవునకును, దేవతల వీర్యమును వర్ధింపజేయు దేవాధిదేవునకును, వినతియగుగాక ! 4. రచిత కార్యవీర్య బాహు మాలినే పరశురామ మాతృభక్తి శాలినే కార్యవీర్యార్జునుడు భక్తితో సేవింపగా అతనికి వేయి దృఢబాహువులను ప్రసాదించిన స్వామికి వినతియగు గాక! పరశురాముడును తన్నుపాసింపగా అతని మాత అయిన రేణుకాదేవి(ఏకవీర)పై భక్తిగల స్వామికి వినతి యగుగాక! 5.
రుచిర పాద వల్లభత్వ సిద్ధయే అనేకవిధములయిన అవతారములు నిత్యము వృద్ధి చెందుటకు గాను, శ్రీపాదవల్లభ తత్త్వమును సిద్ధించుటకొరకును దత్తప్రభువునకు నతి అగునుగాక! ఈ చరణములో శ్రీస్వామీజీ, దత్తావతారముల వృద్ధి తమ రూపములో అగుచున్నదనియు, ప్రణతులిచ్చిన వారికి తాము శ్రీపాదవల్లభ అను తమ పూర్వావతారముగా గోచరము కాగలమనియు, ఇంగితమును సూచించుచున్నారు. 6.
రూప ధారిణే మహితగాణగా పురాధి కారిణే నరసింహ యోగిరూపము ధరించిన స్వామికి, గాణగాపురమందు అధిదేవతగా వెలసిన దేవునకు, ప్రణతి (వినతి) అగుగాక! నరసింహసరస్వతి (నృసింహ యోగీంద్రుని) చరిత్రము విస్తృతముగా నున్న గురుచరిత్ర లేక గురుసంహిత అని ప్రసిద్ధమయిన పావన గ్రంథమును చూచుకొని చదువరులు దత్తదేవుని అవతార విశేషములను తెలిసికొనగలరు. 7.
సచ్చిదానంద తత్త్వ యోగ పాలినే అధిక సిద్ధులను సులభముగా దానము చేయు స్వభావము గల దేవదేవునకును, సచ్చిదానందమను తత్త్వమును యోగముగా పాలించువాడైన దత్తస్వామికి ప్రణామము అగునుగాక! "సచ్చిదానంద" మను తత్త్వమును యోగముగా ధ్యానించి ఉపాసించినవారికి అదియే యోగమగును. ఆ యోగమును పాలించుచు, పాటించుచు, భక్తులకును, శిష్యులకును, ఉపదేశించుచు ఆదేశమునిచ్చుచున్న ఏకైక గురుమూర్తి శ్రీగణపతిస్వామీజీ.
సచ్చిదానంద యోగారూఢులకు ఎన్నియో సిద్దులు సులభముగా లభ్యమగునని శ్రీస్వామీజీ, స్వయముగా నిరూపణము చేసి ప్రత్యక్ష్యముగా సెలవిచ్చుచున్నారు.
namō datta namō datta
కాగడాహారతి - 3 వారము : బుధవారము రాగం : యమన్
భజ భజ దత్తం భజ భజ దత్తం భజ భజ దత్తం భజ దత్తం చరణం : మునిజన వినుతం నతజన సదయం ప్రవిమల హృదయం భజ దత్తం మునిజనులచేత స్తోత్రము చేయబడినట్టియు, ప్రణుతులయినవారి విషయములో దయావంతుడయినట్టియు, నిర్మల హృదయుడునయిన దత్తగురువునుభజింపుము (సేవింపుము). 2.
ప్రశమిత విపదం ప్రకటిత విభవం ప్రణుదిత దురితం భజ దత్తం ఆపదలను శమింపజేసినవాడును, తన వ్యాపకత్వమును ప్రకటింపజేసినవాడును, పాపశమనము చేసినవాడునయిన దత్తుని భజింపుము. 3.
శ్రుతిచయ శిఖరే న న పద ముఖరే సముదిత యశసం భజ దత్తం ఉపనిషత్తులు న, న, అనుచు నిషేధించినవి. అటుపైన యశస్సుతో పైకి వెలువడిన దత్తగురువుని భజింపుము.
పరమాత్మను చెప్పుటకు, ఇదికాదు, అదికాదు, అనుచు సృష్టిలోని సమస్తమును నిషేధించుకొనుచు వెళ్ళిన ఉపనిషత్తులు, వాచ్య వాచక సంబంధముతో పరమాత్మను (దత్తుని) చెప్పజాలకపోయినవి. "యతో వాచోనివర్తన్తే అప్రాప్యమనసా సహ" అనగా వాక్కులకు మనస్సుకు అందనిది, పరమాత్మ తత్త్వమని అర్ధము.
అందువల్లనే బృహదారణ్యకము "నేతినేతి" యనుచు అతన్నిరసనము చేయుచు తత్త్వమును సూచించినది. నిరవధిక నిషేధము లేదు కనుక ఇక మిగిలినది దత్తుని తత్త్వమే యని సారాంశము.
గజేంద్రమోక్షములో చివరకు "నిషేధశేషో జయతాదశేషః" అను వాక్యమునకు ఇదే భావార్ధము. ఈ చరణములో "సముదిత యశసమ్" అను పదము సార్ధకమై సొగసుగనున్నది.
అన్నియును నిషేధింపబడగా తాను(ఆత్మ) గా ఉదయించినవాడు(పైకి లేచిన వస్తువు) దత్తప్రభువు. 4.
అపర దిగచలే మతి గతి వివరే తత నిజ చరితం భజ దత్తం అపరదిక్కు అను పర్వతమున మతి వివరమందు దత్తస్వామియొక్క స్వచరితము విస్తృతముగ నున్నది. అట్టి దత్తుని భజింపుము.
సూర్యుని గమనము ఉదయము నుండి అస్తమయము వరకును సాగుచున్నది. ఉదయమగు బిందువును ఉదయాద్రి అనియు అస్తమించు బిందువును అస్తాద్రి అనియు కవి సమయమై యున్నది.
సూర్యునివల్లనే బుద్ధివృత్తులు ప్రేరేపితమగుచున్నవి. అపరదిక్కును సూర్యుడు చేరుట అన్నది బుద్ధి (మనో) వృత్తులు శమించుటకు లేదా నిద్రకు సంకేతము.
ఆ సందర్భమున మతి(మనస్సు) యొక్క లోతులో నిశ్శబ్దముగా, స్తిమితముగానున్న వృత్తిరహితమైన స్థితిలో తన ప్రభావమును చూపించు దేవుడు దత్తుడే. "ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః" అని చెప్పబడినది దత్తప్రభువే.
అతనిని సేవింపుము. 5.
స్వచరణ కమలే శశిమణి విమలే ధృత నత సుగతిం భజ దత్తం తన చరణ కమలము చంద్రకాంతమణివలె నిర్మలమైనది. దానియందు తనకు ప్రణతులయినవారికి సద్గతిని , నిక్షేపము చేసిన దత్తదేవుని సేవింపుము.
తన పాదకమలమును శరణు పొందినవారి యోగక్షేమగతులు తన పాదసరోజమున సునిక్షిప్తములుగా దాచు దత్తస్వామిని భజింపుము. 6.
నతజన విశయ ప్రదళన నిపుణం మనసిజ హరణం భజ దత్తం ప్రణతులయినవారి సందేహములను భంగము చేయుటలో నిపుణుడయినట్టియు, మన్మథుని హరించినట్టియు, దత్తస్వామిని భజింపుము. 7.
శమదమ నియతై రనుపద కలితం సచ్చిదానందం భజ దత్తం శమదమములతో నియమితులయినవారు ప్రతిక్షణము సేవించుచున్న, సచ్చిదానందుడగు దత్తుని భజింపుము.
You protect the uplifted
Our salutations to You, Sachchidananda
You protect the uplifted
Our salutations to You, Sachchidananda
bhaja bhaja dattaṁ bhaja bhaja dattaṁ
కాగడాహారతి - 3 వారము : బుధవారము రాగం : యమన్
భజ భజ దత్తం భజ భజ దత్తం భజ భజ దత్తం భజ దత్తం చరణం : మునిజన వినుతం నతజన సదయం ప్రవిమల హృదయం భజ దత్తం మునిజనులచేత స్తోత్రము చేయబడినట్టియు, ప్రణుతులయినవారి విషయములో దయావంతుడయినట్టియు, నిర్మల హృదయుడునయిన దత్తగురువునుభజింపుము (సేవింపుము). 2.
ప్రణుదిత దురితం భజ దత్తం ఆపదలను శమింపజేసినవాడును, తన వ్యాపకత్వమును ప్రకటింపజేసినవాడును, పాపశమనము చేసినవాడునయిన దత్తుని భజింపుము. 3.
సముదిత యశసం భజ దత్తం ఉపనిషత్తులు న, న, అనుచు నిషేధించినవి. అటుపైన యశస్సుతో పైకి వెలువడిన దత్తగురువుని భజింపుము.
పరమాత్మను చెప్పుటకు, ఇదికాదు, అదికాదు, అనుచు సృష్టిలోని సమస్తమును నిషేధించుకొనుచు వెళ్ళిన ఉపనిషత్తులు, వాచ్య వాచక సంబంధముతో పరమాత్మను (దత్తుని) చెప్పజాలకపోయినవి. "యతో వాచోనివర్తన్తే అప్రాప్యమనసా సహ" అనగా వాక్కులకు మనస్సుకు అందనిది, పరమాత్మ తత్త్వమని అర్ధము.
అందువల్లనే బృహదారణ్యకము "నేతినేతి" యనుచు అతన్నిరసనము చేయుచు తత్త్వమును సూచించినది. నిరవధిక నిషేధము లేదు కనుక ఇక మిగిలినది దత్తుని తత్త్వమే యని సారాంశము.
గజేంద్రమోక్షములో చివరకు "నిషేధశేషో జయతాదశేషః" అను వాక్యమునకు ఇదే భావార్ధము. ఈ చరణములో "సముదిత యశసమ్" అను పదము సార్ధకమై సొగసుగనున్నది.
అన్నియును నిషేధింపబడగా తాను(ఆత్మ) గా ఉదయించినవాడు(పైకి లేచిన వస్తువు) దత్తప్రభువు. 4.
తత నిజ చరితం భజ దత్తం అపరదిక్కు అను పర్వతమున మతి వివరమందు దత్తస్వామియొక్క స్వచరితము విస్తృతముగ నున్నది. అట్టి దత్తుని భజింపుము.
సూర్యుని గమనము ఉదయము నుండి అస్తమయము వరకును సాగుచున్నది. ఉదయమగు బిందువును ఉదయాద్రి అనియు అస్తమించు బిందువును అస్తాద్రి అనియు కవి సమయమై యున్నది.
సూర్యునివల్లనే బుద్ధివృత్తులు ప్రేరేపితమగుచున్నవి. అపరదిక్కును సూర్యుడు చేరుట అన్నది బుద్ధి (మనో) వృత్తులు శమించుటకు లేదా నిద్రకు సంకేతము.
ఆ సందర్భమున మతి(మనస్సు) యొక్క లోతులో నిశ్శబ్దముగా, స్తిమితముగానున్న వృత్తిరహితమైన స్థితిలో తన ప్రభావమును చూపించు దేవుడు దత్తుడే. "ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః" అని చెప్పబడినది దత్తప్రభువే.
అతనిని సేవింపుము. 5.
ధృత నత సుగతిం భజ దత్తం తన చరణ కమలము చంద్రకాంతమణివలె నిర్మలమైనది. దానియందు తనకు ప్రణతులయినవారికి సద్గతిని , నిక్షేపము చేసిన దత్తదేవుని సేవింపుము.
తన పాదకమలమును శరణు పొందినవారి యోగక్షేమగతులు తన పాదసరోజమున సునిక్షిప్తములుగా దాచు దత్తస్వామిని భజింపుము. 6.
మనసిజ హరణం భజ దత్తం ప్రణతులయినవారి సందేహములను భంగము చేయుటలో నిపుణుడయినట్టియు, మన్మథుని హరించినట్టియు, దత్తస్వామిని భజింపుము. 7.
సచ్చిదానందం భజ దత్తం శమదమములతో నియమితులయినవారు ప్రతిక్షణము సేవించుచున్న, సచ్చిదానందుడగు దత్తుని భజింపుము.
guru caraṇaṁ samata mudā
శిరసి శుభం ధరత సదా గురుపాదమును ఎల్లవేళలా నమస్కరించండి. సంతోషముతో శిరస్సుపైన ధరించండి.
చరణం : భవహరణం జయకరణం అఘశమనం వినత ధనం శ్రుతి వినుతం హృది విదితం రుచి రుచిరం రచిత వరం సంసారమును హరించునదియు, జయము కల్గించునదియు, పాపహరణము చేయునదియు , ధనమునకు స్వాధీనము కానిదియు, వేదములచే నుతింపబడినదియు, హృదయములో తెలియబడినదియు , కాంతిచేత మనోహరమైనదియు, వరములిచ్చునదియు, నయిన గురుచరణమును సదాశిరసున ధరింపుడు. 2.
స్థిర మపి యత్ త్రిభువనగం మిత మపి యత్ మితి రహితం ద్వయ మపి యత్ ద్వయ విగతం గురుపాదయుగము అతి పురాతనమయ్యును, నవీనమయినదియు, స్థిరమైనది అయ్యును , ముల్లోకముల చరించునదియు, మితమైనది అయ్యును పరిమితిలేనిదియు, జంటగా నుండియు, ద్వయము లేనిది (అద్వైతము = ఏకము) అయిన గురుపాద యుగమును శిరసున ధరించుడు.. ఈ చరణములో విషమాలంకారమున్నది.
3.
మునినిచయై రనవాప్తం క్రతుసమయే పునరేవం త్రిదశవరై రపి నాప్తం హృదయమను కోనేరులో దాగికొని ఉన్నట్టియు, మునులచేత పొందరానిదియు (అర్చనలను), క్రతుసమయములో మరల దేవతలకును పొందరానిది( దుర్లభము)యు, అగుగురుపాద యుగళమును శిరసున ధరించుడు. 4.
హరతి శుచం స్ఫురతి యది అపిచ పదే హతవిపది లగయతి యత్ కిల సపది హృదయమును మధింపగా గురుపాదయుగము స్ఫురించుచుండును. స్ఫురించిన తరువాత దుఃఖము ను హరించును.
విపత్తులను పోగొట్టి సుస్థిరమయిన పదమున (స్థానమున) తగుల్కొనునట్లు వెంటనే చేయునట్టి గురుపాదయుగళిని, శిరసున ధరించుడని శ్రీస్వామీజీ బోధిస్తున్నారు. 5.
వేదతతే రపి శిఖరే ధావతి యత్ బహుదూరే భాతి చ మే హృది యదరే సహ్య పర్వత శిఖరము మీదను, వేదముల శీర్షము (ఉపనిషత్తుల) మీదను, చాల చాల దూరములో పరుగెత్తుచుండు గురుచరణము నా హృదిలో భాసిల్లుచున్నది. దూరానఉన్నది, హృదయములో ఉన్నది అనుటచేత ఈ చరణములో కూడా విషమాలంకారమున్నది.
దీనిని ఇంతకు పూర్వము వివరించినాము గనుక, మరల దానిని ఇచట అను సంధానము చేసికొనగలరు. 6.
కమలనిభం కమనీయం రవి రుచిరం శశి సుభగం మృదుమధురం మమ సులభం శ్రీగురుచరణము, పాదతలములలో ఎర్రదిగానున్నది, తెల్లని నఖములు (గోళ్ళు) కలది. కమలమును పోలినది, అందమైనది.
సూర్యుని వలె మనోహరమైనది. చంద్రునిబోలుచు మోహనమైనది.
మృదు మధురమై, నాకు సులభమైనది. దీనిలో చంద్రునివలె ఆహ్లాదకరమైనది, సూర్యునివలె అంధకారమును పారద్రోలునట్టిది, గురుపాదయుగళము అనుటచే విషమాలంకారము స్ఫురించుచున్నది.
7.
యదలర్కోవాప తదా యదిదానీ మహ మాప సచ్చిదానందాకృతి తత్ కార్తవీర్యార్జునుడు పొందగలిగినదియు, అలర్కుడను మహరాజునకు ప్రాప్తమైనదియు, అగు గురుపాదయుగమును నేను పొందినాను. అది సచ్చిదానందాకారమయినది.
అలర్కుని చరితము దత్త భాగవతములో వివరింపబడినది. గమనింపగలరు.
గురు చరణం నమత ముదా శిరసి శుభం ధరత సదా గురుపాదమునకు ఎల్లవేళలా నమస్కరించండి. సంతోషముతో శిరస్సుపైన ధరించండి.
Respectfully bow to Guru’s feet and place those auspicious feet on your head.
Respectfully bow to Guru’s feet and place those auspicious feet on your head.
mantra pramāṇaṁ mantraika vēdyaṁ
మంత్ర స్వరూపం భజ దత్తం మంత్రార్ణ రూపం మంత్రార్ధ గోపం మంత్ర ప్రదీపం భజ దత్తం మంత్రమునకు దత్తుడే ప్రమాణము. మంత్రముద్వారానే, అతడు తెలియదగియున్నాడు.
మంత్రస్వరూపము ఆయనే. మంత్రములలోని అక్షరములు కూడా ఆయన రూపములే.
మంత్రముల అర్థమును అతడు కాపాడును. మంత్రము యొక్క జ్ఞానమునకు అతడే దీపమువంటివాడు.
అటువంటి దత్తుని భజింపుము. "ద్రాం" బీజముగల మంత్రమువలన దారిద్ర్యనాశమగును.
దయకు ఏకైక స్థానమై, ద్రాం బీజమంత్ర దైవతమయిన దత్తుని సేవింపుము. ఆరు అక్షరములు గల మంత్రమువలన సంపత్తు ప్రకాశమానమగును.
మరియు యోగోపదేశముచేయు దత్తదేవుని భజింపుము. షడక్షర మంత్రము :- ద్రాం దత్తాయనమః మరియు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ద్రామ్.
2.
ఆనంద హృద్యం భజ దత్తం ద్వాదశ వర్ణం ఆనంద పూర్ణం యోగోత్తీర్ణం భజ దత్తం ఎనిమిది అక్షరములుగల మంత్రోపాసనతో భవరోగనివారణ చేయునట్టి, ఆనందముతో మనోహరుడయిన దత్తుని సేవించుము. పన్నెండు అక్షరములు గల మంత్రోపాసనచేత ఆనంద పరిపూర్ణ యోగమందుత్తీర్ణుడయిన దత్తస్వామిని భజింపుము.
ద్వాదశాక్షర మంత్రము : ఓం దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః లేక అత్రివరద దత్తాత్రేయాయ నమః।। లేక, ఓం నమో భగవతే దత్తాత్రేయాయ.
అష్టార్ణ మంత్రము : ద్రాం దత్తాత్రేయాయ నమః 3.
కైవల్య భాజం భజ దత్తం దత్తాత్రేయం కృష్ణం హరింతం ఉన్మత్త రూపం భజ దత్తం షోడశాక్షరమంత్ర రూపుడయిన గురురాజు (దత్తుడు) కైవల్యరూపుడు. అతనిని ఉపాసించినచో కైవల్యము లభ్యమగునని ఆంతర్యము.
నల్లగా ఉండి విష్ణురూపుడై పిచ్చివానివలె చరించు దత్తాత్రేయుని భజించుము. "బాలోన్మత్త పిశాచవత్" - అనుచు ఆత్మవేత్తలు బాలురవలె, పిచ్చివారివలె, పిశాచములవలె ఉంటారని శాస్త్రప్రమాణమున్నది.
దత్తదేవుడు షోడశాక్షర జపము చేత కైవల్యప్రదుడై ఉన్మత్తునిగా దర్శనమిస్తాడు. షోడశాక్షరమంత్రము: "ఓం ద్రాం స్రాం హ్రీం క్లీం శ్రీం క్ష్మ్రాం శ్రీమద్దత్తాత్రేయాయ నమః" లేక, "ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రూం సౌః దత్తాత్రేయాయ స్వాహా" 4.
ఆనందదాయకం మునిబాలరూపం పిశాచ వేషం భజ దత్తం విశుధ్ధ జ్ఞాన సాగరమీశం సచ్చిదానందం భజ దత్తం చిన్న మునికుమారునివలె దత్తస్వామి ఆనందప్రదుడై కనబడుతాడు. పిశాచవేషములో దత్తప్రభువు దర్శనమిస్తాడు.
విశుద్ద జ్ఞానమునకు సాగరుడయిన ఈశ్వరుడే దత్తదేవుడు. సచ్చిదానందుడయిన ఆ దత్తుని భజింపుము.
Lord Dattatreya lends authority to the seed letters (mantras). He can be known only by mantras and He is of the form of mantras.
Each and every letter of the mantra is Lord Datta personified. He is the savior of the meaning of mantras.
Sing His divine names, sing His divine grace who illuminates all the mantras.
Lord Datta dwells in the single seed letter _dram_. He destroys poverty.
Chant the name of Datta, who is the abode of mercy. Lord Datta is worshipped with the mantra of six letters, which bestows wealth.
Sing the name of Datta, who initiates into yoga.
He can be known with eight lettered mantra, which is a doctor for the disease called _bhavaroga_ (mortality). He is sweet because He is the embodiment of bliss.
His twelve lettered mantra gives supreme happiness. Sing the glory of Datta, who has mastered yoga.
Sing Datta's divine names as He is ever liberated. He is the king of all masters.
Dattatreya is the presiding deity for the sixteen-lettered mantra. Krishna is Datta and Lord Vishnu is Datta.
He is ever in the state of exalted ecstasy.
Sing His divine glory. He appears in the ascetic and in the boy forms.
He is in all and appears in the form of a devil also. He is the ocean of the pure knowledge.
Datta is the controller and Sachchidananda. Sing His glory.

pālaya māmiha sadguru datta
మామిహ పాలయ సద్గురు దత్త సద్గురు దత్తా నన్ను పాలింపుము. నన్నిప్పుడు పాలింపుము.
చరణం : సంతత మంగళ దాయక దత్త సంచిత పాపవినాశక దత్త ఎల్లప్పుడు మంగళమునిచ్చు దత్తప్రభో, సంచిత పాపాలను నాశనముదేవా, దత్తగురో, నన్ను పాలింపుము 2. శోధయ మానస మాదిమ దత్త బోధయ సంవిద మర్చిత దత్త ఆదిదేవా, దత్తగురో, నా మనస్సును శోధింపుము.
సాఫీగా ఉంచుము. సంవిత్తును (జ్ఞానమును) తెలియజేయుము.
దేవా, శోధితము, జ్ఞానబోధభరితము అయిన హృదయములో అర్చితుడవై యుండుమని భావము. 3.
సాధయ, మోద, మఖండిత, దత్త రాధయ కామరయం గురుదత్త అఖండ స్వరూపుడవయిన దత్తదేవా, మోదమును సాధించి తెమ్ము. కామవేగమును తగ్గించివేయుము.
4. ఓమితి శ్రీమితి ద్రామితి దత్త బీజ మహాక్షర బోధిత దత్త ఓ దత్తదేవా, ఓమ్ శ్రీమ్ ద్రామ్ - అను బీజాక్షరములతో బోధింపబడిన దత్తదేవా, నన్ను పాలింపుము.
5. అక్షర తత్త్వ విచక్షణ దత్త మంత్ర మహోదధి మంథర దత్త అక్షరతత్త్వము తెలిసిన దత్తదేవా, మంత్రమహోదధి మథనము చేసిన మందర పర్వతమును పోలినదేవా, నన్ను పరిపాలింపుము.
సమస్త మంత్రములను ఎరిగి అక్షరముల తత్త్వమును తెలిసిన దత్తగురువు, అక్షమాలను ధరిస్తారు. అక్షములనగా పూసలు.
ఇంద్రియములు అక్షరముల సంఖ్యలో రుద్రాక్షలు లేక స్ఫటికములు అయ్యుండును. అక్షమాల కలిగిన దత్తుడు అక్షరములను వశీకరించుకొన్నాడు.
అక్షరముల యోజనముచేత మంత్రములేర్పడును. ఈ యోజన తెలిసినవాడని ముందు చెప్తారు.
6. యోగ విదాంవర యోజిత దత్త యోగగ యోగద యోగప దత్త దత్తదేవా, యోగవేత్తలలో సర్వశ్రేష్ఠా, యోజనమునకు (మంత్రాక్షర సంయోగమునకు) లక్ష్యమయిన దత్తగురో, యోగమునందున్నవాడా, యోగమునిచ్చువాడా, యోగమును కాపాడువాడా, నన్ను పాలింపుము.
7.
సచ్చిదానంద యతీశ్వర దత్త దత్తదేవా, నాయందనురాగమును ప్రేరేపించుము. సచ్చిదానంద యతీశ్వర రూపా, దత్తగురో, నన్ను రక్షింపుము.
దత్తదేవుడు నాయందు అనురాగమును (వాత్యల్యమును), చూపవలెను. దానికి నిదర్శనమేమి యనగా సచ్చిదానందయతీంద్రునిగా దర్శనమిచ్చుటయే.
శ్రీ గణపతి సచ్చిదానంద యతివరుని రూపములో దత్తాత్రేయస్వామి గోచరమయినచో స్వామికి మనయందు అనురాగమున్నట్లే. దత్తాత్రేయుని గానము చేయు నెపముతో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని దైవముగా గుర్తించినచో మనమందరము అనగా భజనయోగము చదువుకొనువారందరమును ధన్యులమే.
pālaya māmiha sadguru datta māmiha pālaya sadguru datta
You are the destroyer of accumulated sins.
Oh beginningless Datta, purify my mind.
Oh, One worshipped by all, give me knowledge.
pālaya māmiha sadguru datta māmiha pālaya sadguru datta
You are the destroyer of accumulated sins.
Oh beginningless Datta, purify my mind.
Oh, One worshipped by all, give me knowledge.
śrīdatta dēvaṁ śirasā namāmi
శ్రీదత్త రాజం మనసా స్మరామి దత్తదేవుని శిరస్సుతో నమస్కరించుచున్నాను. దత్తరాజును మనసా స్మరించుచున్నాను.
చరణం : శ్రీ అత్రి ఘనయోగ ఫలభూత దేహమ్ సితరస్మి దుర్వాస సహజాత యుగ్మమ్ నిజమాతృ భవబంధ నిర్మోక దక్షమ్ నిజభక్త రక్షార్థ సహ్యాద్రి వాసమ్ అత్రిమహర్షియొక్క మహాతపోయోగమునకు సత్ఫలముగా అవతరించినట్టియు, చంద్రుడు, దుర్వాసుడు అను ఇర్వురు సోదరులతో కూడినట్టియు , తన తల్లికి సంసారబంధ మోక్షమునిచ్చుటలో సమర్ధుడయినట్టియు తన భక్తుల రక్షణకుగాను సహ్యాద్రియందు నివాసము చేయునట్టియు దత్తదేవుని శిరసు వంచి నమస్కారము చేయుచు , మనసుతో స్మరించుదును. 2.
పరిపాలి తేంద్రం వేద ప్రదానోప కృత బ్రహ్మదేవం ప్రహ్లద పరిపాల మవధూత రూపం యతివేష సంబుద్ధ యదు రాజరాజం శ్రీదత్తగురుదేవులు, జంభుడను రాక్షసుని సంహరించి ఇంద్రుని పరిపాలించారు. వేదములను తీసికొనివచ్చి బ్రహ్మదేవునకు మహోపకారము చేశారు.
ప్రహ్లాదునకు అవధూత రూపములో ఉపదేశము చేసి తరింపచేశారు. యతివేషములో, యదుమహారాజును బోధగలవానినిగా జేసి అనుగ్రహించారు.
అట్టి దత్తప్రభువును శిరస్సుతో అనగా సాష్టాంగ ప్రణామముతో నమస్కరించుచున్నాను. వేదములు శ్రుతులని చెప్పబడుచున్నవి.
అవి గురుశిష్యపరంపరగ వచ్చినవి గాని లిఖితగ్రంథములు కావు. అట్టిచో వేదములను హయగ్రీవుడను రాక్షసుడు దొంగిలించుట, విష్ణువు (దత్తుడు) వాటిని మరల ఉద్ధరించుట అనునది ఎట్లు వీలుపడినది? అను ప్రశ్నకు జవాబు దేవీభాగవతమునందున్నది.
దేవతలకు, ఋషులకు, వేదములు స్ఫురణకు రాక, లోకములు తల్లడిల్లినవి. దేవుడు వేదముల నుద్ధరింపగా, అప్పుడు వారికి మరల వేదములు స్మృతికి వచ్చినవని దుర్గమాసుర వృత్తాంతములో చెప్పబడినది.
3.
నిజ బోధ నోన్మోచి తాలర్క రాజం శ్రీకార్త వీర్యాఖ్య వరదాన వీరం భృగురామ బోధిత త్రిపురా రహస్యం దత్తస్వామి, విష్ణుదత్తుడను బ్రాహ్మణునకు, దత్తస్వామి దత్తమంత్రముపదేశించి ఉద్ధరించారు. అలర్క మహారాజుకు జ్ఞానోపదేశము చేసి తరింపజేశారు.
కార్తవీర్యార్జునునకు అనేక వరములిచ్చి అనుగ్రహించారు. పరశురామునకు త్రిపురారహస్యమును బోధించారు.
అట్టి గురుస్వామిని, శిరసా, నమస్కరించి మనసా స్మరించుచుందును. 4.
సద్భద్ర శీలీకృతాత్మీయ భక్తం ఆయుర్మహారాజ వరదాన ధీరం ఆజన్మ పరిపుష్ట నహుషాధిరాజం ధర్మకీర్తియను రాజును కరుణతో కాపాడిన దత్తప్రభువు , భద్రశీలుడను వానిని భక్తునిగా చేసికొని ఆదరించినారు. తన భక్తుడయిన ప్రతివ్యక్తిని భద్రశీలునిగా తీర్చిదిద్దుతున్నారు.
ఆయువు అను మహారాజునకు వరదానములు చేసినారు. నహుష మహారాజును జన్మనుండి పరిపోషించారు.
అట్టిగురుస్వామియగు దత్తప్రభువును, శిరసా, మనసా, నమస్కరించుదును. 5.
నరసింహ యతిరాజ రాజావతారం శ్రీ సచ్చిదానంద నిత్యప్రకాశం శ్రీ సచ్చిదానంద నిత్యప్రకాశం శ్రీపాదవల్లభుడుగా, నృసింహసరస్వతి యను యోగిగా, ప్రస్తుతము సచ్చిదానంద యతిగా, అవతారములను చూపించిన దత్తస్వామిని శిరసా మనసా నమస్కరించెదను. ఈ స్తోత్రములో శ్రీస్వామీజీ, మనకు దత్తస్వామి చరిత్రలోని భక్తపోషణ లీలలను అందించారు.
వాసుదేవానంద సరస్వతీస్వామి సంస్కృతములో రచించిన దత్తభాగవవతమును గురుసంహిత(గురుచరిత్ర) ను చదువుకొని వానిలో ఈ స్తోత్రములోని ప్రసంగములను విపులముగా గ్రహింపగలము.
I bow down before Lord Datta.
I constantly remember Datta with the whole of my mind.
Datta blessed the childless King Ayu with progeny. He guarded Ayus' son, King Nahusha.
I bow down to Datta Guru Deva who is now shining the form of the great Sachchidananda.

Texts, rāgam and tāḷam settings and commentary from the Bhajan Mala corpus (bhajanmala.com), compositions of H.H. Sri Ganapathy Sachchidananda Swamiji.